- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి కాల్పుల కలకలం.. 12 మంది మృతి
మెక్సికోలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది.

దిశ, వెబ్ డెస్క్: మెక్సికోలో (Mexico) మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది. గుయానుయాటో రాష్ట్రంలోని ఇరాపుయాటో నగరంలో బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) దుండగులు అకస్మాత్తుగా కాల్పులకు (Firing) తెగబడ్డారు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ (St. John the Baptist) పండుగ సందర్భంగా స్థానికులు వీధిలో నృత్యాలు చేస్తూ, మద్యం సేవిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సమయంలో గుర్తుతెలియని దుండగులు ఓసారిగా అక్కడికి చేరి కాల్పులు ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారాయి. వీడియోల్లో ప్రజలు అరుస్తూ, పరుగులు తీస్తూ తప్పించుకుంటున్న దృశ్యాలు కనిపించాయి.
ఈ ఘటనపపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షైన్‌బౌమ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. కాగా, ఇటీవలే అదే రాష్ట్రంలోని శాన్ బార్టోలో డే బెరియోస్ ప్రాంతంలో క్యాథలిక్ చర్చ్ నిర్వహించిన ఓ పార్టీపై జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. గుయానుయాటో రాష్ట్రం ఆ దేశంలోని అత్యంత హింసాత్మక ప్రాంతాల్లో ఒకటిగా మారింది. వివిధ ఆర్గనైజ్డ్ క్రైమ్ గుంపులు ఆధిపత్యం కోసం పరస్పరం గొడవలకు పాల్పడుతున్నారు. ఈ సంవత్సరం మొదటి ఐదు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 1,435 హత్యలు నమోదయ్యాయి.






