- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో మరోసారి కాల్పులు.. ఇద్దరు మృతి, 8 మందికి తీవ్ర గాయాలు
అగ్రదేశం అమెరికా (America)లోని ప్రతిష్టాత్మక ఐవీ లీగ్ యూనివర్సిటీలలో ఒకటైన బ్రౌన్ యూనివర్సిటీ క్యాంపస్ (Brown University Campus)లో శనివారం మధ్యాహ్నం ఓ ఆగంతకుడు కాల్పుల మోత మోగించాడు.

దిశ, వెబ్‌డెస్క్: అగ్రదేశం అమెరికా (America)లోని ప్రతిష్టాత్మక ఐవీ లీగ్ యూనివర్సిటీలలో ఒకటైన బ్రౌన్ యూనివర్సిటీ క్యాంపస్ (Brown University Campus)లో శనివారం మధ్యాహ్నం ఓ ఆగంతకుడు కాల్పుల మోత మోగించాడు. ఈ దుర్ఘటనలో మొత్తం ఇద్దరు మరణించగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి జరిగిన బారస్ అండ్ హోలీ (Barus & Holley) ఇంజినీరింగ్ భవనంలో ఫైనల్ పరీక్షలు జరుగుతున్న సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి.
యూనివర్సిటీ ప్రొవోస్ట్ ఫ్రాంక్ డోయల్ మాట్లాడుతూ.. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి నల్లటి దుస్తులు ధరించి గన్‌తో కాల్పులు జరిపాడని పేర్కొన్నారు. అనంతరం అతడు భయంతో హోప్ స్ట్రీట్ వైపు పరారైనట్లుగా తెలిపారు. ఈ క్రమంలోనే క్యాంపస్, చుట్టుపక్కల ప్రాంతాల్లో షెల్టర్-ఇన్-ప్లేస్ ఆదేశాలు అమలులో ఉన్నాయి. FBI, ATF సహా అన్ని ఏజెన్సీలు ఘటనపై దర్యాప్తు చేపడుతున్నాయి. కాల్పుల్లో గాయపడిన ఎనిమిది మందిని చికిత్స నిమిత్తం రోడ్ ఐలాండ్ ఆస్పత్రికి తరలించారు. వారిలో మరో ఆరుగురి పరిస్థితి విషయంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతులు, గాయపడినవారు విద్యార్థులేనా అనే విషయం ఇంకా ధృవీకరించలేదు.






