అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఇద్దరు మృతి!

by Yella Dhawani Reddy |

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది.

అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఇద్దరు మృతి!
X

దిశ, వెబ్ డెస్క్:అమెరికాలో (America) మరోసారి కాల్పుల (Firing) మోత మోగింది. ఈ ఘటన ఇద్దరు పోలీసు అధికారులు మృతిచెందారు. ఆదివారం రాత్రి యూటా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ట్రెమొంటన్ పట్టణంలోని ఓ ఇంటి నుంచి ఆదివారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) గృహ హింసకు సంబంధించి ఎమర్జె్న్సీ సహాయం కోసం 911కు ఫిర్యాదు వచ్చింది. దీనిపై స్పందించిన పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. ముందుగా ఓ పోలీసు అధికారి ఆ ఇంటి వద్దకు వెళ్లి వ్యక్తితో మాట్లాడుతుండగా, నిందితుడు అకస్మాత్తుగా తుపాకీతో బయటకు వచ్చి కాల్పులు ప్రారంభించాడు. ఈ ఘటనలో ఆ అధికారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది చూసి షాకైన మరో అధికారి అక్కడి వెళ్తుండగా నిందితుడు మరోసారి కాల్పులు జరపటంతో ఆ అధికారి కూడా ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story