మరో షాకింగ్ న్యూస్.. 9 విదేశీ ఎంబసీలకు బాంబు బెదిరింపులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-30 10:52:41  IST  )

చెన్నై (Chennai)లో గత కొన్ని వారాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయా ఆగంతకుల నుంచి బాంబు బెదిరింపు కాల్స్ (Bomb Threat Calls) వస్తున్నాయి.

మరో షాకింగ్ న్యూస్.. 9 విదేశీ ఎంబసీలకు బాంబు బెదిరింపులు
X

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై (Chennai)లో గత కొన్ని వారాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయా ఆగంతకుల నుంచి బాంబు బెదిరింపు కాల్స్ (Bomb Threat Calls) వస్తున్నాయి. ఇప్పటికే చెన్నైలోని రాజ్ భవన్, సెక్రటేరియట్ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. చెన్నై కేంద్రంగా పని చేస్తున్న వివిధ దేశాల ఎంబసీలకు సంబంధించిన కాన్సులేట్ జనరల్, హానరరీ కాన్సులేటు కార్యాలయాలకు ఇవాళ ఆగంతకుడి నుంచి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. కార్యాలయాల్లో బాంబులు పెట్టామని, కాసేపట్లో భారీ పేలుడు సంభవించబోతున్నట్లుగా ఆగంతకుడు చెప్పాడు.

దీంతో అప్రమత్తమైన చెన్నై పోలీసులు బాంబు, డాగ్ స్క్వాడ్‌తో ఆయా కాన్సులేట్ జనరల్ కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బెదిరింపు కాల్స్ వచ్చిన వాటిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆమెరికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్ కాన్సులేట్ జనరల్, హనరరీ కాన్సులేట్ కార్యాలయాలు ఉన్నాయి. బాంబు బెదిరింపు నేపథ్యంలో ప్రజలను భయపడవద్దని, అనవసర ఊహాగానాలు వ్యాప్తి చేయవద్దని కోరారు. ఏదైనా అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే డయల్-100‌కు వెంటనే కాల్ చేయాలని విజ్క్షప్తి చేశారు. ఆయా కాన్సులేట్ కార్యాలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Next Story