విజయ్ కు మరో షాక్.. TVKపై పోలీసులకు ఫిర్యాదు

by velandi.Saikiran |

విజయ్ కు మరో షాక్ త‌గిలింది..ఫోర్జరీ జరిగిందన్న దినకరన్.. TVKపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

విజయ్ కు మరో షాక్.. TVKపై పోలీసులకు ఫిర్యాదు
X

దిశ‌, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో గంటకో పరిణామం చోటు చేసుకుంటోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ చాలా కష్టపడుతున్న నేపథ్యంలో... ఫోర్జరీ జరిగిందని టీవీకేపై తాజాగా పోలీసులకు ఫిర్యాదు అందింది. తమ ఎమ్మెల్యే మద్దతు ఇచ్చినట్లు టీవీకే నకిలీ పత్రాన్ని ఫోర్జరీ చేసి గవర్నర్ కు ఇచ్చిందని AMMK చీఫ్ దినకరన్ షాకింగ్ ఆరోపణలు చేశారు. తమిళనాడు గవర్నర్ కు ఒరిజినల్ కాపీ చూపించామన్న ఆయన, టీవీకేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే ఈ నేపథ్యంలో TVK కూడా కౌంటర్ ఇచ్చింది. ఎమ్మెల్యే కామరాజు మద్దతు లేఖ‌పై సైన్ చేస్తున్న వీడియో రిలీజ్ చేసింది. తొలుత దీనిని దినకరన్ ఆమోదించారని.. కానీ అంతలోనే ఆయన యూటర్న్ తీసుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఇలా ఉండగా, అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఛాన్స్ ఇవ్వాలని దినకరన్ లేఖ‌ కూడా రాశారు. దీంతో తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరిగాయి.

Next Story