- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశ రాజధానిలో మరో సంచలనం.. సీఎం రేఖా గుప్తాపై ఆగంతకుడి దాడి
దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో మరో సంచలనం చోటుచేసుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఓ ఆగంతకుడు దాడికి పాల్పడ్డాడు. ‘జన్ సువాయ్’ కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుడిలా వచ్చిన ఓ దుండగుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన సివిల్ లైన్స్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద కాసేపటి క్రితం చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా నిందితుడిని 35 ఏళ్ల వయసు ఉన్న రాజేష్ భాయ్ ఖిమ్జీ భాయ్ సకారియాగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
అయితే, సీఎం రేఖా గుప్తాపై దాడిని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ ఖండించారు. ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న అంజలి అనే మహిళ మాట్లాడుతూ.. ‘జన్ సున్‌వాయ్’ కార్యక్రమం కొనసాగుతుండగా.. ఓ వ్యక్తి వినతి పత్రంతో సీఎం రేఖా గుప్తా వద్దకు వెళ్లాడని తెలిపింది. అనంతరం నిందితుడు అహ్మద్ బాషా సీఎంను చెంపదెబ్బ కొట్టి.. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మరింత దాడి చేసేందుకు యత్నించాడని పేర్కొంది. దీంతో పోలీసులు వెంటనే అతడిని అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారని అంజలి వివరించింది. కాగా, ఢిల్లీ సీఎంపై దాడి చేసిన దుండగుడు గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌కు చెందిన రాజేష్ భాయ్ ఖిమ్జీభాయ్ సకారియాగా అక్కడి పోలీసులు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందజేశారు. బంధువును జైలు నుంచి విడిపించేందుకు సీఎం సాయం కోరడానికి వచ్చి వినతిపత్రం ఇచ్చే క్రమంలో నిందితుడు సీఎం రేఖా గుప్తాపై దాడికి పాల్పడ్డాడు.






