దేశంలో మరో సంచలనం.. టేకాఫ్ అయిన విమానం మిస్సింగ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-24 06:41:42  IST  )

టేకాఫ్ అయిన విమానం అదృశ్యమైన ఘటన రష్యాలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది.

దేశంలో మరో సంచలనం.. టేకాఫ్ అయిన విమానం మిస్సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: టేకాఫ్ అయిన విమానం అదృశ్యమైన ఘటన రష్యా (Russia)లో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అంగారా (Angara) ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం మొత్తం 50 మంది ప్రయాణికులతో టిండా నగరానికి బయలుదేరింది. అయితే, ఫ్లైట్ చైనా సరిహద్దులోని అమూర్ ప్రాంతం వద్దకు చేరుకోగానే ఏటీసీ (ATC) నుంచి పూర్తిగా సంబంధాలు కట్ అయ్యాయి. దీంతో విమానం ఒక్కసారిగా అదృశ్యమై.. ఫ్లైట్ క్రూ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈ నేపథ్యంలోనే విమానాన్ని ట్రేస్ చేసేందుకు రష్యాకు చెందిన ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీ (Federal Air Transport Agency) హుటాహుటిన రంగంలోకి దిగింది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story