కర్రెగుట్టలో మరోసారి కాల్పుల మోత.. మహిళా మావోయిస్టు మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-06 08:22:39  IST  )

‘ఆపరేషన్ కగార్‌’‌లో భాగంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ (Telangana-Chhattisgarh) రాష్ట్రాల సరిహద్దులోని కర్రిగుట్ట (Karriguttalu)ల్లో కేంద్ర బలగాలు చేపడుతోన్న కూంబింగ్‌ (Combing) నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది.

కర్రెగుట్టలో మరోసారి కాల్పుల మోత.. మహిళా మావోయిస్టు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆపరేషన్ కగార్‌’‌లో భాగంగా తెలంగాణ - ఛత్తీస్‌గఢ్‌ (Telangana-Chhattisgarh) రాష్ట్రాల సరిహద్దులోని కర్రిగుట్ట (Karriguttalu)ల్లో కేంద్ర బలగాలు చేపడుతోన్న కూంబింగ్‌ (Combing) నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు (Maoists) అమర్చిన మందుపాతరలు (Landmines), ఐఈడీ బాంబు (IED Bomb)లను ఐడెంటిఫై చేస్తూ భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఈ మేరకు స్పాట్‌లో 303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.

ఫార్వర్డ్ బేస్ క్యాంపుల బేస్ క్యాంపుల ఏర్పాటు..

కర్రిగుట్టల అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ మేరకు ధోబే కొండలు (Dhobey Hills), నీలం సరాయి (Neelam Sarai) కొండల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపు (Forward Base Camp)లను ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా అలుబాక (Alubaka) శివారులో మరో బేస్ క్యాంప్‌ను కూడా ఏర్పాటు ప్రక్రియి పూర్తి చేశారు. ఇక మావోయిస్టుల జాడను తెలుసుకునేందుకు డ్రోన్ల (Drones) కోసం ప్రత్యేక సిగ్నలింగ్ టవర్ల (Signaling Towers)ను నిర్మించారు. CRPFకు చెందిన ప్రత్యేక K9, K3 డాగ్ స్క్వాడ్ బృందాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కర్రిగుట్టల్లో వందల సంఖ్యలో మవోయిస్టులు భూగర్భ బంకర్లు ఉన్నట్లుగా సమాచారం అందడంతో ముందు ఆ బంకర్ల గుర్తింపునకు సీఆర్‌పీఎఫ్ (CRPF) దళాల వేట కొనసాగుతోంది.

Next Story