కోల్‌కతాలో మరో అత్యాచారం.. ఖండించిన బాధితురాలి తండ్రి

by Muthe.Rajitha |

గతేడాది నుంచి కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ సంచలనాలు రేపుతూనే ఉంది.

కోల్‌కతాలో మరో అత్యాచారం.. ఖండించిన బాధితురాలి తండ్రి
X

దిశ, వెబ్ డెస్క్ : గతేడాది కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిని హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆ ఘటన మరవక ముందే కోల్‌కతాలోని మరో ప్రతిష్టాత్మక కాలజీలో ఇంకో అత్యాచార ఘటన జరగడం మరోసారి సంచలనం రేపింది. ఓ విద్యార్థినికి అక్కడి ఇండియన్ ఇన్స్టిస్టూట్ ఆఫ్ మేనేజ్మెంట్(IIM) లో సీటు ఇప్పిస్తామని కాలేజీకి రప్పించి, కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి, అనంతరం విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టినట్టు సమాచారం.

అయితే ఈ ఘటన అక్కడి బాయ్స్ క్యాంపస్ లో జరిగినట్టు వార్తలు వస్తుండగా.. బాధితురాలి తండ్రి మాత్రం ఈ వార్తలను ఖండించారు. తన కూతురుపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, తను కొద్దిగా అనారోగ్యానికి గురైందని పేర్కొన్నారు. కొంతమంది అత్యాచారం జరిగినట్టు కేసు నమోదు చేయాలని ఒత్తిడి తెస్తున్నట్టు కూడా అయన తెలిపారు.

Next Story