అమెరికాలో మరో విమానానికి తప్పిన ప్రమాదం

by Yella Dhawani Reddy |

అగ్రరాజ్యం అమెరికాలో మంగళవారం (అమెరికా కాలమాన ప్రకారం) మరో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.

అమెరికాలో మరో విమానానికి తప్పిన ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో మంగళవారం (అమెరికా కాలమాన ప్రకారం) మరో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. షికాగో మిడ్‌వే ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో (Chicago Midway Airport) రెండు విమానాలు ఒకదానికొకటి దాదాపు ఢీకొనే పరిస్థితి నెలకొంది. అయితే, పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదాన్ని నివారించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఒమాహా నుంచి వచ్చిన సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్ విమానం షికాగో ఎయిర్‌పోర్టులో రన్ వే 31సీపై ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమైంది. అయితే, అదే సమయానికి అదే రన్‌వేపై ప్రైవేట్ జెట్ అడ్డంగా వచ్చింది. దీన్ని గమనించిన సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది అప్రమత్తమై మళ్లీ విమానాన్ని గాల్లోకి ఎగిరించారు. అప్పటికే ఈ విమాన చక్రాలు నేలను తాకాయి. అయితే, పైలట్ల అప్రమత్తతతో ఈ రెండు విమానాలు ఢీకొనే ప్రమాదం తప్పింది.

ఈ ఘటనపై ఫెడరల్‌ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌ (FAA) దర్యాప్తు చేపట్టింది. సదరు ప్రైవేట్ జెట్ ఎలాంటి అనుమతులు లేకుండానే ఒక్కసారిగా రన్‌వేపైకి వచ్చిందని ఎఫ్‌ఏఏ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇటీవల అగ్రరాజ్యం అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘటనల్లో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయిన సంగతి తెలిసిందే.

Next Story