దూకుడు పెంచిన సీబీఐ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో వ్యక్తి అరెస్ట్

by Disha Web Desk 19 |
దూకుడు పెంచిన సీబీఐ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో వ్యక్తి అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ మరొకరిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో నిన్న అరవింద్ సింగ్ అనే న్యూస్ ఛానెల్ ఉద్యోగిని అరెస్ట్ చేసిన సీబీఐ.. మంగళవారం చరణ్ ప్రీత్ సింగ్ అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో హజరు పరుచారు. ఇతనికి రెండు రోజుల సీబీఐ కస్టడీ విధించింది. సోమవారం అరెస్టయి సీబీఐ కస్టడీలో ఉన్న అరవింద్ కుమార్ సింగ్‌తో కలిపి చరణ్ ప్రీత్ సింగ్‌ను సీబీఐ విచారించే అవకాశాలు ఉన్నాయి.

లిక్కర్ స్కాం కేసులో అరవింద్ సింగ్ పాత్ర ఉందని, రూ.17 కోట్ల నగదు లావాదేవీలు జరిపినట్లు సీబీఐ గుర్తించింది. ఈ క్రమంలో తాజాగా చరణ్ ప్రీత్ సింగ్‌ను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవడంతో ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది. కాగా ఈ కేసులో ఇప్పటికే రెండు ఛార్జిషీట్లు దాఖలు చేసిన సీబీఐ రెండవ అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసే దిశగా అడుగులు వేస్తోంది.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story