ఇరాన్‌కు మరో భారీ ఎదురుదెబ్బ.. ఖుద్స్‌ ఫోర్స్‌ కమాండర్‌ హతం

by Yella Dhawani Reddy |

ఇరాన్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

ఇరాన్‌కు మరో భారీ ఎదురుదెబ్బ.. ఖుద్స్‌ ఫోర్స్‌ కమాండర్‌ హతం
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్‌కు (Iran) మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్‌ (Isreal) సైన్యం చేపట్టిన లక్ష్యిత దాడుల్లో ఖుద్స్‌ ఫోర్స్‌కు (Quds Force) చెందిన కీలక కమాండర్‌ బెహ్నామ్‌ షాహ్‌రియారీ హతమయ్యాడు. ఆయుధాల సరఫరా విభాగానికి చీఫ్‌గా ఉన్న షాహ్‌రియారీ, ఇరాన్ నుంచి హమాస్‌, హెజ్‌బొల్లా, హూతీ వంటి సంస్థలకు ఆయుధాలు చేరే వ్యవస్థలో ప్రధాన భూమిక పోషించేవారని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (IDF) వెల్లడించింది. ఈ దాడిలో అతడితో పాటు మరికొంతమంది కూడా మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో ఖుద్స్‌ ఫోర్స్‌ కార్యకలాపాల్లో కీలకమైన భాగం స్తంభించే అవకాశం ఉంది.

ఇరాన్ మద్దతు ఇస్తున్న ఉగ్రవాద సంస్థలకు ఆయుధాల సరఫరా పై ఇజ్రాయెల్‌ ఇప్పటికే పలు దఫాలుగా దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే బెహ్నామ్‌ షాహ్‌రియారీ హత్య, మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలను మరింత పెంచే ప్రమాదం ఉంది. గతంలో ఖుద్స్‌ ఫోర్స్‌ కమాండర్‌ ఖాసీమ్‌ సులేమానీను అమెరికా హతమార్చిన తర్వాత, ఇదే స్థాయిలో దెబ్బగా ఈ దాడిని భావిస్తున్నారు. తాజా ఘటన నేపథ్యంలో ఇరాన్‌ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story