జార్ఖండ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

by Kema Shiva Kumar |

‘ఆపరేష్ కగార్’‌ విషయంలో కేంద్రం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో గత కొన్ని నెలలుగా జార్ఖండ్ పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా వరుస ఆపరేషన్లను చేపడుతూ ముందుకు సాగుతున్నారు.

జార్ఖండ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆపరేష్ కగార్’‌ విషయంలో కేంద్రం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో గత కొన్ని నెలలుగా జార్ఖండ్ పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా వరుస ఆపరేషన్లను చేపడుతూ ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా లాటేహార్, లోహర్దగా, గుమ్లా, చత్రా లాంటి దట్టమైన అడవుల్లో వరున ఎన్‌కౌంటర్లకు వేదికలుగా మారాయి. ఇప్పటికే పలు ఆపరేషన్లలో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు మావోయిస్ట్ సాహిత్యాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం గామ్లా జిల్లాలోని ఘాగ్రా అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, సెక్యూరిటీ ఫోర్సెస్‌కు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో సీపీఐ (మావోయిస్ట్) నుంచి విడిపోయిన జార్ఖండ్ జన్ ముక్తి పరిషద్ (JJMP) సభ్యులు ముగ్గురు తీవ్రమైన బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. అదేవిధంగా మావోయిస్టు సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని జార్ఖండ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) మైఖేల్ ఎస్.రాజ్ వెల్లడించారు. తమ భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడగా.. లొంగిపొమ్మని చెప్పినా వారు వినకుండా కాల్పులు జరిపారని, ప్రాణ రక్షణ కోసం తాము ఫైర్ ఓపెన్ చేశామని ఆయన తెలిపారు. తమవైపు నుంచి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు.

Next Story