- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chattisghar Liquor Scam : దేశంలో మరో భారీ లిక్కర్ స్కాం... సీఎం ఇంట్లో ఈడీ సోదాలు
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) దేశవ్యాప్తంగా ఎంత దుమారం రేపిందో తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) దేశవ్యాప్తంగా ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kerjiwal) తోపాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల ముఖ్య నాయకులు ఈ స్కాంలో ఉన్నట్టు వెలుగులోకి రావడం దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ స్కాం దేశంలోని పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను కూడా మార్చివేసింది. కాగా తాజాగా మరో భారీ లిక్కర్ స్కాంను బయటపెట్టింది ఈడీ(ED). ఛత్తీస్‌గఢ్ లో లిక్కర్ స్కాంలో భారీగా డబ్బులు చేతులు మారినట్టు గుర్తించింది. ఈ కేసులో ఛత్తీస్‌గఢ్ సీఎం(Chatthisghar CM) మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆ రాష్ట్ర సీఎం భూపేష్ బఘేల్(CM Bhupesh Baghel) కుమారుడు చైతన్య బఘేల్(Chaithanya Baghel) నివాసాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. ఈ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై చైతన్య, మరికొందరి ఇళ్లలో తనిఖీలు సాగుతున్నాయి. చైతన్యకు సన్నిహితుడిగా పేరున్న లక్ష్మీ నారాయణ్ బన్సాల్ అలియాస్ పప్పు బన్సాల్, మరికొందరి ఇళ్లలో ఈడీ రైడ్స్ జరుపుతోంది.
లిక్కర్ స్కాం ఛత్తీస్‌గఢ్ ఖజానాకు భారీ నష్టాన్ని కలిగించిందని, లిక్కర్ సిండికేట్ ఏకంగా రూ. 2,100 కోట్లు కొల్లగొట్టిందని ఈడీ గతంలో పేర్కొంది. ఈ కేసులో మాజీ మంత్రి కవాసి లఖ్మా, రాయపూర్ మేయర్ సోదరుడు అన్వర్ ధెబార్, మాజీ ఐఏఎస్ అనిల్ టుటేజా తదితరులను జనవరిలో అరెస్టు చేసింది. 2019, 2022 మధ్య ఛత్తీస్‌గఢ్ సీఎంగా భూపేష్ బఘేల్ ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది. మద్యం అక్రమాల ద్వారా వచ్చిన ఆదాయం చైతన్య బఘేల్‌కు చేరిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా ఖండించింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions) తిరిగి ప్రారంభమైన రోజునే, కాంగ్రెస్ నేతలపై ఈడీ దాడులు చేయడం ఒక కుట్రలో భాగమని పేర్కొంది. పార్లమెంట్‌లో విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలను హైడ్‌లైన్స్‌లో రాకుండా చేసేందుకు, వాటిని మేనేజ్ చేసేందుకు మోడీ(PM Modi) సర్కార్ చేసిన కుట్ర ఇదని ఆరోపించింది.






