రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం.. 10 గంటల ముందే చార్ట్

by Muthe.Rajitha |

రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం.. 10 గంటల ముందే చార్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రైలు బయల్దేరే నాలుగు గంటల ముందు రిజర్వేషన్ చార్ట్ సిద్ధం చేస్తుండగా.. ఇకపై దాదాపు పది గంటల ముందుగానే చార్టును ఖరారు చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా చార్ట్ ప్రిపరేషన్ షెడ్యూల్‌ను రైల్వే బోర్డు అప్‌డేట్ చేస్తూ అన్ని జోనల్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బయల్దేరే రైళ్లకు తొలి చార్టు ముందు రోజు రాత్రి 8 గంటలకల్లా సిద్ధం కానుంది.

మధ్యాహ్నం 2.01 నుంచి రాత్రి 11.59 గంటల వరకు, అలాగే అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు బయల్దేరే రైళ్లకు కనీసం 10 గంటల ముందే తొలి చార్టు సిద్ధం చేయనున్నారు. దీని వల్ల ప్రయాణికులు ముందుగానే టికెట్ స్థితిని తెలుసుకుని అవసరమైతే ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉండనుంది. దీనివల్ల చివరి నిమిషంలో ప్రయాణికుల గందరగోళం, టెన్షన్ తగ్గుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

Next Story