కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. విక్రమ్ మిస్రీ పదవీ కాలం పొడిగింపు

by Kema Shiva Kumar |

ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ (ACC) ఆమోదంతో కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి.

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. విక్రమ్ మిస్రీ పదవీ కాలం పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: విదేశాంగ వ్యవహారాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సంబంధిత శాఖ కార్యదర్శి (Foreign Secretary) విక్రమ్ మిస్రీ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ (ACC) ఇందుకు అధికారికంగా ఆమోదం తెలిపడంతో అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.

కాగా, వాస్తవానికి 1989 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి అయిన విక్రమ్ మిస్రీ ప్రస్తుత సేవా కాలం జూలై 14తో ముగియనుంది. తాజా పదవీకాలం పొడిగింపు నిర్ణయంతో ఆయన జూలై 14, 2027 వరకు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విదేశాంగ శాఖ కార్యదర్శిగా బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖకు చెందిన పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (DoPT) కార్యదర్శి మనీషా సక్సేనా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story