- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశానికే మరో మణిహారం.. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ప్రారంభించిన ప్రధాని మోడీ
ఉత్తరప్రదేశ్‌లోని జేవర్ వద్ద నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అట్టహాసంగా ప్రారంభించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ అభివృద్ధి పథంలో మరో చారిత్రాత్మక మైలురాయి ఆవిష్కృతమైంది. జేవర్ (Jewar) వద్ద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (Noida International Airport) మొదటి దశను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయం..
జేవర్ విమానాశ్రయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇది ఆసియాలోనే అతిపెద్దదిగా, ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద విమానాశ్రయంగా అవతరించనుంది. దాదాపు రూ.11,282 కోట్ల వ్యయంతో మొదటి దశను పూర్తి చేశారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం సుమారు రూ. 29,560 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రారంభ దశలో ఈ ఎయిర్‌పోర్టు ఏడాదికి 1.2 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించగలదు. భవిష్యత్తులో దీనిని 7 కోట్లకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పొగమంచు సమయాల్లో కూడా విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా 3,900 మీటర్ల పొడవైన రన్‌వేను, అధునాతన నావిగేషన్ వ్యవస్థ (Navigation System)ను ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు కేవలం 10 నిమిషాల్లో చెక్-ఇన్ (Check-in) ప్రక్రియ పూర్తి చేసుకునేలా డిజిటల్ వ్యవస్థను రూపొందించారు. ఈ ఎయిర్‌పోర్టు విమానాశ్రయం ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) ప్రాంతంతో పాటు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని పారిశ్రామిక, పర్యాటక రంగాలకు ఆయువుపట్టు కానుంది.






