- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Wife harassment: భార్య వేధింపులు.. మరో ఐటీ ఉద్యోగి బలవన్మరణం.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా డిఫెన్స్ కాలనీకి చెందిన మానవ్ శర్మ (35) తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భార్య వేధింపులకు తాళలేక మరో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా డిఫెన్స్ కాలనీకి చెందిన (Manav Sharma) మానవ్ శర్మ (35) తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ముంబాయిలోని టీసీఎస్‌లో రిక్రూట్‌మెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న మానవ్.. బలవన్మరణానికి పాల్పడే ముందు ఓ భావోద్వేగభరిత సెల్ఫీ వీడియో తీస్తూ తన భార్య నికితా శర్మపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ వీడియోలో మానవ్ మాట్లాడుతూ.. ‘నా భార్య టార్చర్ భరించలేక పోతున్నా, ఆమె నడవడికపై అనుమానం వచ్చింది, తరచూనాపై దురుసుగా ప్రవర్తించేది, ఇదివరకు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించా, కానీ నన్ను మరింత మానసిక క్షోభకు గురిచేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నా’ అంటూ తెలిపారు.
దాదాపు 6.57 నిమిషాల వీడియోలో మానవ్ తల్లి దండ్రులకు క్షమాపణలు చెప్పారు. ‘పాపా, మమ్మీ, అక్కూ, సారీ.. ఇక నేను వెళ్లిపోతున్నా’ అని తెలిపారు. సమాజంలో పురుషుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉండాల్సిన అవసరం. దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా మాట్లాడండి. పురుషులు కూడా తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు, నేను ఒంటరిని అయిపోయాను’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. చివరకు, మానవ్ ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై మానవ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తన కొడుకు 2024లో వివాహం చేసుకున్నారని,పెళ్లి తర్వాత మానవ్ తన భార్యను ముంబాయికి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఆమె తరచూ గొడవలు పడేవారని తెలిపారు. ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నట్లు అనుమానం ఉన్నట్లు తండ్రి ఆరోపించారు. అదేవిధంగా ఘటనపై మానవ్ భార్య నికితా శర్మ స్పందించింది. మానవ్ వీడియోను చూశాను. తను అధికంగా మద్యం తాగే వాడని, తనను కొట్టేవాడని చెప్పారు. అతను చేసిన ఆరోపణలు వివాహానికి ముందే జరిగాయని, పెళ్లి తర్వాత అలాంటిదేమీ జరగలేదన్నారు. అయితే, గతంలో బెంగూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అతుల్ సుభాష్, ఇటీవల ఢిల్లీలో ఉడ్ బాక్స్ కేఫ్ యజమాని పునీత్ ఖురానా ఆత్మహత్య చేసుకున్న ఘటనను గుర్తుచేస్తోంది. భార్య వేధింపులు తాళలేక భర్తలు ప్రాణాలు తీసుకోవడం నెట్టింట చర్చానీయాంశంగా మారింది.






