- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ! మరి కాసేపట్లో 25 మంది సరెండర్
జార్ఖండ్‌లో 'ఆపరేషన్ నవజీవన్' ద్వారా భారీ విజయం. ఇవాళ డీజీపీ తడషా మిశ్రా సమక్షంలో మిసిర్ బెస్రా బాడీగార్డ్‌తో సహా 25 మంది మావోయిస్టుల లొంగిపోబోతున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టు పార్టీలో మిగిలిన అగ్రనేతలతోపాటు రహస్య జీవితం గడుపుతున్న మావోయిస్టుల కోసం భద్రతా దళాల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టు రహిత సమాజ స్థాపన దిశగా భద్రతా దళాలు అత్యంత కీలకమైన విజయాన్ని సాధించాయి. జార్ఖండ్ చరిత్రలోనే అతిపెద్ద మావోయిస్టుల లొంగుబాటుకు (Maoist surrender) రాంచీ నగరంలోని పోలీస్ ప్రధాన కార్యాలయం వేదిక కానుంది. ఇవాళ 25 మంది వరకు మావోయిస్టులు లొంగిపోబోతున్నట్లు జార్ఖండ్ పోలీసులు (Jharkhand police) ప్రకటించారు. ఆపరేషన్ నవజీవన్‍లో (Operation Navjeevan) భాగంగా ఈ సరెండర్ ప్రక్రియ జరుగుతోందని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసుల నిరంతర ఆపరేషన్ల కారణంగా ఇటీవల కాలంలో తెలంగాణ, పశ్చిమ బెంగాల్‍లో మిసిర్ బెస్రా దళానికి చెందిన సభ్యులు కొంతమంది సరెండర్ అయ్యారు. ఈ క్రమంలో ఇవాళ మరో భారీ సరెండర్ ఉండబోతుందని పోలీసులు తెలిపారు. ఇవాళ లొంగిపోబోతున్న మావోయిస్టులలో కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 3 జోనల్ కమిటీ సభ్యులు (ZCM), 4 సబ్ జోనల్ కమిటీ సబ్యులు (SZCM) సభ్యులు ఉన్నట్లు సమాచారం.
మిసిర్ బెస్రా బాడీగార్డ్ సైతం:
ఇవాళ సరెండర్ కాబోతున్న 25 మందిలో ప్రభాత్ ముండా అలియాస్ ముఖియా (సబ్-జోనల్ కమిటీ సభ్యుడు), సాంగేన్ అగరియా (సబ్-జోనల్ కమిటీ సభ్యుడు), సోహన్ అలియాస్ రంగా (సబ్-జోనల్ కమిటీ సభ్యుడు) గుల్షన్ అలియాస్ గాడి (జోనల్ కమిటీ సభ్యుడు), జయకాంత్ అలియాస్ గూంగా (జోనల్ కమిటీ సభ్యుడు), అశ్విన్ (జోనల్ కమిటీ సభ్యుడు)చందన్ లోహరా ( జోనల్ కమిటీ సభ్యుడు) ఉన్నారు. జోనల్ కమిటీ సభ్యుడు చందన్ లోహరాతో పాటు అతని భార్యలు పారుల్, సప్న కూడా పోలీసుల ముందు లొంగిపోతున్నారు. వీరిద్దరూ ఈ నిషేధిత సంస్థలో ఏరియా కమిటీ సభ్యులుగా (ACM) పనిచేస్తున్నారు. అలాగే, మోస్ట్ వాంటెడ్ టాప్ మావోయిస్ట్ నేత మిసిర్ బెస్రా బాడీగార్డ్, ఏరియా కమిటీ సభ్యుడు సనత్ అలియాస్ ఇత్వారీ మాంఝీ కూడా లొంగిపోతున్న వారిలో ఉన్నట్లు సమారం. అయితే వీరంతా తమ ఆయుధాలను జార్ఖండ్ డీజీపీ తడషా మిశ్రా, కొల్హాన్ ప్రాంతానికి చెందిన సీనియర్ పోలీసు అధఇకారుల సమక్షంలో అధికారికంగా తమ ఆయుధాలను అప్పగించి సరెండర్ కాబోతున్నారు. ఒకేసారి ఇంతమంది కీలక నేతలు, సాయుధ దళాల సభ్యులు లొంగిపోనుండటం మావోయిస్టు పార్టీకి జార్ఖండ్-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కోలుకోలేని దెబ్బ అని పోలీసులు చెబుతున్నారు.






