అన్నదాతలకు మరో తీపికబురు.. MSP ధరల పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-01 11:05:54  IST  )

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అధ్యక్షతలో ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది.

అన్నదాతలకు మరో తీపికబురు.. MSP ధరల పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అధ్యక్షతలో ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో ప్రధానంగా దేశ ఆర్థిక, సంక్షేమ, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం వంటి కీలక అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందుకు సంబంధించిన విషయాలను కేంద్ర సమాచార మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ (Dearness Allowance) 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు పెంచిన డీఏ జూలై 1 నుంచి అమలులోకి రానుందని.. తాజా నిర్ణయంలో దేశ వ్యాప్తంగా ఉన్న 49.2 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.

అదేవిధంగా దేశంలో 57 నూతన కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు ఆమోద ముద్ర వేశామని ప్రకటించారు. పప్పు దినుసులు కోసం ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద రూ.11,440 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని తెలిపారు. లోథల్(గుజరాత్)లో ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర వారసత్వ సంక్లెక్స్‌ను రూపొందించనున్నామని తెలిపారు. రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలైన రోడ్లు, విద్యుత్, నీటి సరఫరాకు ఆమోదం తెలిపామని.. ఇందుకు గాను రూ.1,500 కోట్లును కేటాయించనున్నట్లుగా పేర్కొన్నారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26 కోసం రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని ఉద్దేశంతో 14 పంటలకు MSP ధరల పెంపునకు ఆమోదం తెలిపామని, ఉత్పత్తి ఖర్చుపై కనీసం 1.5 రెట్లు ఉండేలా MSP ధర ఖరారు చేసినట్లుగా అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద LPG సబ్సిడీకి 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.12,060 కోట్లు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు LPG అండర్-రికవరీలకు పరిహారం కింద రూ.30 వేల కోట్లు కేటాయించి, LPG సరఫరాను నిరంతరం చేయాలని నిర్ణయించామన్నారు. MERITE స్కీమ్ కింద 275 ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ సంస్థల్లో సాంకేతిక విద్యను మెరుగుపరచడానికి రూ.4,200 కోట్లు, అదేవిధంగా అస్సాం, త్రిపురా రాష్ట్రాల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు కొత్త 4 కాంపోనెంట్లకు 4,250 కోట్లు కేటాయించినట్లుగా మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు.

Next Story