రైతులకు మరో తీపికబురు.. ఖాతాల్లోకి రూ.20,500 కోట్లు జమ

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-02 05:59:30  IST  )

దేశంలో చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించి వారి జీవనోపాధిని మెరుగుపరచడం, వ్యవసాయ అవసరాలకు మద్దతునివ్వడం పీఎం కిసాన్ యోజన పథకం (PM Kisan Yojana Scheme) ఉద్దేశం.

రైతులకు మరో తీపికబురు.. ఖాతాల్లోకి రూ.20,500 కోట్లు జమ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించి వారి జీవనోపాధిని మెరుగుపరచడం, వ్యవసాయ అవసరాలకు మద్దతునివ్వడం పీఎం కిసాన్ యోజన పథకం (PM Kisan Yojana Scheme) ఉద్దేశం. ఈ పథకం కింద, రైతులకు ఏటా రూ.6 వేలు మూడు వాయిదాల్లో కేంద్ర ప్రభుత్వం (Central Government) నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తోంది. ఇప్పటికే 19 విడతలు నగదు జమ చేసి సర్కార్ ఇవాళ 20 విడత పీఎం కిసాన్ నిధులను జమ చేసింది. ప్రస్తుతం వారణాసిలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) నిధులను ఇవాళ విడుదల చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అయినట్లుగా తెలుస్తోంది. 20వ విడత నిధుల విడుదలలో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న 9.7 కోట్ల మంది బ్యాంకు ఖాతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు రూ.20,500 కోట్లను జమ చేయనున్నారు. పీఎం కిసాన్ యోజన పథకం డబ్బులు రైతుల ఖాతాలో పడ్డాయో.. లేదో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ https://pmkisan.gov.inలోకి వెళ్లాలని అధికారులు సూచించారు.

Next Story