ఛత్తీస్‌గఢ్‌లో మరో భీకర ఎన్‌కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-26 05:05:07  IST  )

భద్రతా బలగాలు చేపడుతోన్న ‘ఆపరేషన్ కగార్’‌తో దండకారణ్యాలు రక్తపుటేరులుగా మారుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లో మరో భీకర ఎన్‌కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్/భద్రాచలం: భద్రతా బలగాలు చేపడుతోన్న ‘ఆపరేషన్ కగార్’‌తో దండకారణ్యాలు రక్తపుటేరులుగా మారుతున్నాయి. వరుస ఎన్‌కౌంటర్లు మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున ఛత్తీస్‌గఢ్‌లోని కోహ్కమెట పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. వివరాల్లోకి వెళితే.. అబూజ్‌మడ్ అడవుల్లో మావోయిస్టు ముఖ్య నేతలు, దళ సభ్యులు రహస్య సమావేశం నిర్వహిస్తున్నారని స్టేట్ ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది.

దీంతో మాడ్ డివిజన్‌లోని మావోయిస్టు నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేయడానికి నిర్వహిస్తున్న ఇంటెన్సివ్ ఆపరేషన్‌లో భాగమైన నారాయణపూర్ డీఆర్జీ, కొండగావ్ డీఆర్జీ, ఎస్‌టీఎఫ్ బృందం జాయింట్ కూబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే వారికి మావోయిస్టులు ఎదురుపడగా.. ఇరు వర్గాల మధ్య 8 గంటల పాటు భీకర ఎదరుకాల్పలు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో మాడ్ డివిజన్‌లో క్రియాశీల సభ్యులుగా చెప్పబడుతున్న ఇద్దరు మహిళా నక్సలైట్లు తీవ్రమైన బుల్లెట్ గాయాలతో అక్కడికిక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్పాట్‌లో రెండు మృతదేహాలు, ఒక ఇన్సాస్ రైఫిల్, 315 బోర్ గన్‌, విప్లవ సాహిత్యంతో పాటు మెడికల్ కిట్, భద్రతా బలగాల ట్రాప్‌నకు ఉపయోగించే ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లుగా ఐజీ బస్తర్ పి.సుందర్రాజ్ వెల్లడించారు. హెలికాప్టర్లు, డ్రోన్లతో కూబింగ్ ఆపరేషన్ చేపడుతున్నట్లుగా తెలుస్తోంది.

Next Story