- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో మరో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన వంతెన, ఆరుగురు దుర్మరణం
దేశంలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర (Maharashtra)లోని పూణే (Pune) కుందంలాలో ఇంద్రాయణి నది (Indrayani River)పై ఉన్న పాత ఇనుప వంతెన ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. వీకెండ్ కావడంతో పర్యాటకులు ప్రకృతి అందాలను వీక్షించేందుకు శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిపైకి వెళ్లగా.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అది రెండు ముక్కలైంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పింప్రి-చించ్వాడ్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలోని తాళేగావ్ దభాడే పోలీస్ స్టేషన్ సిబ్బంది స్పాట్‌కు జాతీయ విపత్తు స్పందన బృందాన్ని (NDRF) వెంట పెట్టుకుని వెళ్లారు. అనంతరం వారు గల్లంతైన 25 మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఈ ఘటనపై మావల్ ఎమ్మెల్యే సునీల్ షెల్కే (MLA Sunil Shelke) మాట్లాడుతూ.. ఇంద్రాయణి నదిపై ఉన్న ఇనుప బ్రిడ్జి 30 ఏళ్ల కాలం నాటిదని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జిపై సుమారు 100 మంది వరకు ఉన్నారని పేర్కొన్నారు. కొందరు నదిలో పడిపోయినప్పటికీ అందులో కొంతమంది ఒడ్డుకు చేరుకోగలిగారని తెలిపారు. ఘటనా స్థలంలో 25 మంది ఆచూకీ కోసం రెండు NDRF బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నాయని సునీల్ షెల్కే స్పష్టం చేశారు.






