యూపీలో మరో ఎన్‌కౌంటర్.. గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ కుమారుడు హతం

by Disha Web Desk 12 |
యూపీలో మరో ఎన్‌కౌంటర్.. గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ కుమారుడు హతం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర ప్రదేశ్‌లో మరో గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ పోలీసులు ఎన్ కౌంటర్ లో హతమైనట్లు తెలుస్తుంది. ఉమేష్ పాల్ హత్య కేసులో వాంటెడ్ ఉన్న అసద్ కోసం.. ఝాన్సీలో DySP నవేందు DySP విమల్ నేతృత్వంలోని UP స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జరిగిన ఎన్ కౌంటర్‌లో అసద్‌తో పాటు ఈ కేసులో వాంటెడ్ గా ఉన్న గులాం కూడా హతమయ్యాడు. కాగా వారి నుంచి పోలీసులు అత్యాధునిక విదేశీ టెక్నాలజీ తో తయారైన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed