Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

by Muthe.Rajitha |   (  Updated:2025-06-11 15:57:23  IST  )

ఇటీవల వరుస ఎన్కౌంటర్స్(Encounter) లో ఎదురు దెబ్బలు తింటున్న మావోయిస్టుల(Maoists)కు మరో భారీ షాక్ తగిలింది.

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల వరుస ఎన్కౌంటర్స్(Encounter) లో ఎదురు దెబ్బలు తింటున్న మావోయిస్టుల(Maoists)కు మరో భారీ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని సుక్మా(Sukma) జిల్లా కుకనార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో బుధవారం సాయంత్రం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డట్టు సమాచారం. మృతుల్లో లోకల్ స్క్వాడ్ కమాండర్ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్. ఈ ఘటనలో భారీగా ఆయుధాలు, నక్సల్స్ సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story