- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Earthquake : మయన్మార్ లో మరోసారి భూకంపం
మయన్మార్ ను మరోసారి భూకంపం(Mayanmar Earthquake) వణికించింది.

దిశ, వెబ్ డెస్క్ : మయన్మార్ ను మరోసారి భూకంపం(Mayanmar Earthquake) వణికించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదైంది. ప్రాణ భయంతో ప్రజలు బిక్క చచ్చిపోయారు. దీని ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇటీవలే మయన్మార్ ను భారీ భూకంపం అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. మార్చి 28న రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు కాగా... మయన్మార్, బ్యాంకాక్(Bankok) లో వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలి పోయాయి. ఒకే రోజు మూడుసార్లు అధిక తీవ్రతతో భూకంపాలు సంభవించడంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. ఈ భూకంప ధాటికి 2700 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 4500 మందికి పైగా గాయపడ్డారు. మరో 500 మండి ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. శిథిలాల కింద భారీ సంఖ్యలో జనం చిక్కుకుపోయారని అధికారులు భావిస్తున్నారు. కాగా మయన్మార్, థాయ్ లాండ్(Thailand) కు సహాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి. ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, నీరు, షెల్టర్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు.






