SIR పని ఒత్తిడి.. మరో BLO ఆత్మహత్య

by Naga Rani Yarlagadda |

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది.

SIR పని ఒత్తిడి.. మరో BLO ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో బూత్ లెవర్ ఆఫీసర్లు (BLO) పనిఒత్తిడికి గురవుతున్నారు. తాజాగా మరో BLO "సర్" పనిఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన సర్వేశ్ సింగ్ (46) ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ఆధారంగా అతను పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

మురాదాబాద్ లోని ఓ స్కూల్లో అసిస్టెంట్ టీచర్ గా పనిచేస్తున్న సర్వేశ్ సింగ్ కు అక్టోబర్ 7న SIR పనులు అప్పగించారు. ఈ క్రమంలో ఆయనపై తీవ్రమైన పని ఒత్తిడి పడిందని వీడియోలో వాపోయాడు. SIR వర్క్ ప్రెజర్ కారణంగానే చనిపోతున్నట్లు తెలిపాడు. ఎంత కష్టపడినా తన పనిని పూర్తి చేయలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలా సూసైడ్ చేసుకుంటున్నందుకు తనను క్షమించాలని, ఇద్దరు కూతుర్లను జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబ సభ్యుల్ని కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story