ఓఎంసీ కేసులో బిగ్ ట్విస్ట్.. CBI కోర్టులో గాలి జనార్దన్ రెడ్డి మరో పిటిషన్

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-14 07:22:53  IST  )

15 ఏళ్ల సుధీర్ఘ విచారణ తరువాత ఓబులాపురం (Obulapuram) అక్రమ మైనింగ్ కేసు (Obulapuram Illegal Mining Case)లో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌‌ రెడ్డి (Gali Janardhan Reddy)ని నాంపల్లిలోని CBI స్పెషల్ కోర్టు దోషులుగా తేల్చి విషయం తెలిసిందే.

ఓఎంసీ కేసులో బిగ్ ట్విస్ట్.. CBI కోర్టులో గాలి జనార్దన్ రెడ్డి మరో పిటిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: 15 ఏళ్ల సుధీర్ఘ విచారణ తరువాత ఓబులాపురం (Obulapuram) అక్రమ మైనింగ్ కేసు (Obulapuram Illegal Mining Case)లో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌‌ రెడ్డి (Gali Janardhan Reddy)ని నాంపల్లిలోని CBI స్పెషల్ కోర్టు దోషులుగా తేల్చి విషయం తెలిసిందే. నలుగురు నిందితులకు ఏడేళ్ల పాటు జైలు శిక్ష, రూ.లక్ష చొప్పున జరిమానా విధించారు. అయితే, కేసులో అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అప్పటి IAS కృపానంద రెడ్డిని నిర్దోషులని తేలింది. దీంతో CBI అధికారులు గాలి జనార్దన్ రెడ్డితో సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ ఎస్కార్ట్‌‌‌‌‌తో చంచల్‌‌‌‌గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తతం జైలులో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి తాజాగా సీబీఐ (ఢహఉ) స్పెషల్ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. చంచల్‌గూడ జైలులో తనకు అసౌకర్యంగా ఉందని, A క్లాస్ సౌకర్యాలు కల్పించేలా కోర్టు, అధికారులను ఆదేశించాలని ఆయన తరఫు న్యాయవాదులు ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. విచారణ తేదీని మాత్రం ప్రకటించ లేదు.

Next Story