- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sheikh Hasina :షేక్ హసీనాపై మరో అరెస్ట్
by Muthe.Rajitha |
బంగ్లాదేశ్(Bangladesh) మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా(Sheikh Hasina)పై బంగ్లా సుప్రీంకోర్ట్ మరోసారి అరెస్ట్ వారెంట్(Arrest Warrant) జారీ చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్(Bangladesh) మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా(Sheikh Hasina)పై బంగ్లా సుప్రీంకోర్ట్ మరోసారి అరెస్ట్ వారెంట్(Arrest Warrent) జారీ చేసింది. షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు.. అధికారం అడ్డం పెట్టుకొని అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలతో ఈ వారెంట్ జారీ చేసింది కోర్ట్. ఈ కేసులో హసీనాతోపాటు ఆమె సోదరి, ఎంపీ తులిప్ రిజ్వాన సిద్ధిక్, మరో 50 మంది ఈ అక్రమాలకు పాల్పడ్డారని అవినీతి నిరోధక కమిషన్(ACC) ఆరోపిస్తూ బంగ్లాదేశ్ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిని పరిశీలించిన న్యాయస్థానం.. వారందరికీ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ.. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. కాగా ఇటీవలే నివాస స్థలాలు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు చేస్తూ.. షేక్ హసీనాతో పాటు మరో 17 మందిపై వారెంటు జారీ చేసిన విషయం తెలిసిందే.
Next Story






