- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. మధ్యలోనే ల్యాండింగ్
ఎయిరిండియాకు చెందిన విమానాల్లో సాంకేతిక లోపాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఎయిరిండియాకు (Air India) చెందిన విమానాల్లో సాంకేతిక లోపాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసిన కొన్ని ఘటనలు మరవకముందే, తాజాగా మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ముంబై నుంచి లండన్‌కు (Mumbai to London) వెళ్తున్న విమానం గాల్లో ఉండగానే పైలట్లు ఆ లోపాన్ని గుర్తించి, భద్రతను దృష్టిలో ఉంచుకుని విమానాన్ని ఆస్ట్రియా రాజధాని వియన్నాలో (Vienna, the capital of Austria) అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఘటన సమయంలో విమానంలో సుమారు 200 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. సాంకేతిక సమస్య తీవ్రతను పరిశీలించిన తర్వాత, విమాన ప్రయాణాన్ని కొనసాగించకుండా అక్కడే నిలిపివేయాలని ఎయిరిండియా నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా ప్రయాణికులు విపరీతమైన అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. కాగా, తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు కొంతమంది ఇతర విమానాలను ఎంచుకున్నారు.
ఇక ప్రయాణికుల కోరిక మేరకు టికెట్లకు వారు చెల్లించిన మొత్తాన్ని పూర్తిగా రీఫండ్ చేయనున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. సాంకేతిక లోపంపై విచారణ జరుపుతున్నామని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది.






