- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని మోడీ మరో ఘనత.. గ్లోబల్ లీడర్లలో అగ్రస్థానం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ పొందిన ప్రజాస్వామ్య నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) మరో ఘనత సాధించారు. ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ పొందిన ప్రజాస్వామ్య నాయకుడిగా గుర్తింపు పొందారు. అమెరికా ఆధారిత డేటా అనలిటిక్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ జులై 4 నుంచి 10 మధ్య గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్ (Global Democratic Leader Approval Ratings) సర్వే నిర్వహించింది. ఇందులో మోడీకి 75 శాతం మంది మద్దతుతో అగ్రస్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఆ తర్వాత దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యంగ్ (59%), అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే (57%) వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 44 శాతం మద్దతుతో 8వ స్థానంలో ఉన్నారు. ఇక సర్వేలో మోడీకి 18 శాతం డిజ్‌అప్రూవ్, 7 శాతం ఎటువంటి అభిప్రాయం లేదని పేర్కొంది.
ఈ సందర్భంగా దీనిపై బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో స్పందిస్తూ భారతదేశంలో బిలియన్ మందికి పైగా ప్రజల ప్రేమను పొందిన నాయకుడు, ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడే నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. మార్నింగ్ కన్సల్ట్ గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్‌లో అగ్రస్థానంలో నిలివటం సంతోషం వ్యక్తం చేశారు. శక్తివంతమైన నాయకత్వం, గ్లోబల్ గౌరవం చూస్తుంటే భారత్ భద్రమైన చేతుల్లో ఉందని వ్యాఖ్యానించారు. మోడీని ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన నాయకుడిగా ప్రజలు చూసేలా ఉన్నారనే విషయం ఈ సర్వే ద్వారా మరోసారి రుజువైందన్నారు.






