- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లా స్టూడెంట్‌పై అత్యాచారం కేసు.. నిందితుడిపై మరో స్టూడెంట్ ఆరోపణలు
కోల్‌కతాలో లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం కేసులో (Kolkata Law Student Rape Case) ప్రధాన నిందితుడు, తృణమూల్ నాయకుడైన మోనోజిత్ మిశ్రా (31) అలియాస్ మ్యాంగో మహిళలపై చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్ : కోల్‌కతాలో లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం కేసులో (Kolkata Law Student Rape Case) ప్రధాన నిందితుడు, తృణమూల్ నాయకుడైన మోనోజిత్ మిశ్రా (31) అలియాస్ మ్యాంగో మహిళలపై చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో లా స్టూడెంట్ కూడా అతనిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు నేషనల్ మీడియాలో వెల్లడయ్యాయి. వాటి ప్రకారం.. మోనోజిత్ మిశ్రా తనను రెండేళ్ల క్రితం లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయం మరెవరికైనా చెప్తే తన ఫ్యామిలీ మొత్తాన్నీ చంపుతానని బెదిరించాడని, అతనికి రాజకీయ నాయకులతో పరిచయాలు ఉండటంతో పోలీసులకు కంప్లైట్ చేసేందుకు కూడా భయపడి వెనకడుగు వేసినట్లు పేర్కొంది. ఇలా మరో 15 మంది స్టూడెంట్స్ ను అతను లైంగికంగా వేధించినట్లు ఆమె ఆరోపించింది.
కాగా.. మిశ్రా పై గతంలోనూ అనేక కంప్లైంట్స్ రాగా.. అతనికి ఉన్న రాజకీయ నేతల అండదండలు చూసీ పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. ప్రస్తుతం పోలీసులు అతడిని అరెస్ట్ చేయడంతో ధైర్యం చేసి ఈ విషయాలన్నీ చెప్తున్నానని తెలిపింది. అమ్మాయిలను వేధించిన బ్యాగ్రౌండ్ మోనోజిత్ కు ఉందని అతని జూనియర్స్, బ్యాచ్ మేట్స్ పేర్కొన్నారు. స్టూడెంట్స్ మార్ఫింగ్ ఫొటోలతో పాటు.. ఓ మహిళతో ఏకాంతంగా గడిపిన వాటిని కూడా చూపించేవాడని అతని ఫ్రెండ్స్ చెప్పడంతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు విస్తుపోయారు.






