- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anna Hazare: అందుకే ప్రజలు ఆప్‌ను ఓడించారు.. అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) ఎన్నడూ లేని విధంగా బీజేపీ (BJP) ప్రభంజనం కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) ఎన్నడూ లేని విధంగా బీజేపీ (BJP) ప్రభంజనం కొనసాగుతోంది. ఏకంగా ఆ పార్టీ మొత్తం 44 నియోజకవర్గాల్లో అప్రతిహతంగా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు అధికార ఆమ్ఆద్మీ పార్టీ మాత్రం కేవలం 26 స్థానాల్లో అది కూడా వందల్లో మాత్రమే లీడ్‌లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) ఫలితాలపై సామాజిక కార్యకర్త అన్నా హజారే (Anna Hazare), మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార దాహంతో కేజ్రీవాల్ ఆమ్‌ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని అన్నారు. మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న కేజ్రీవాల్‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయని మండిపడ్డారు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ (Liquor Scam)తో ఆప్ ప్రభుత్వంతో పాటు కేజ్రీవాల్ (Kejriwal) బద్నాం అయ్యారని కామెంట్ చేశారు. అందుకే ఢిల్లీ ప్రజలకు ఆమ్ఆద్మీ పార్టీని ఓడగొట్టారని అన్నా హజరే అన్నారు.






