Anita Anand: కెనడా కేబినెట్‌లో నలుగురు భారత సంతతి నేతలు.. విదేశాంగ మంత్రిగా ఆనితా ఆనంద్‌

by B.Srinivas |

ఇటీవల జరిగిన కెనడా సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Anita Anand: కెనడా కేబినెట్‌లో నలుగురు భారత సంతతి నేతలు.. విదేశాంగ మంత్రిగా ఆనితా ఆనంద్‌
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన కెనడా (Canada) సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ (Liberal party) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మార్క్ కార్నీ (Mark carney) మరోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే తాజాగా తన నూతన మంత్రి వర్గాన్ని నియమించారు. ఈ కేబినెట్‌లో భారత సంతతి మహిళ అనితా ఆనంద్‌ (Anitha anand) కు కీలక పదవి దక్కింది. కెనడా విదేశాంగ మంత్రిగా అమె నియమితులయ్యారు. లిబరల్ పార్టీ సీనియర్ నాయకురాలు అనిత గతంలో ట్రూడో హయాంలో రక్షణ మంత్రిగా పని చేశారు. ఈ క్రమంలోనే మార్క్ కార్నీ మరోసారి కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమె తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేగాక మరో ముగ్గురు భారత సంతతి నేతలకు సైతం కేబినెట్‌లో చోటు దక్కింది. వారిలో అంతర్జాతీయ వాణిజ్య మంత్రిగా మణీందర్ సింధు (Maninder sindhu) , విదేశాంగ కార్యదర్శులుగా రూబీ సహోటా (Rubee sahota), రణదీప్ సారాయ్ (Ranadeep sarai) లు ఉన్నారు.

అనితా ఆనంద్ నేపథ్యం?

అనితా ఆనంద్ 1967 మే 20న నోవా స్కోటియాలోని కైంట్ విల్లేలో జన్మించారు. ఆమె తండ్రి భారత్‌లోని తమిళనాడుకు చెందిన వారు కాగా, తల్లి పంజాబ్‌కు చెందిన వారు. 1960లో వీరు కెనడాకు వలస వెళ్లారు. అనిత క్వీన్స్ విశ్వవిద్యాలయం, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, , డల్హౌసీ విశ్వవిద్యాలయం, టొరంటో విశ్వవిద్యాలయంలో నుంచి పలు డిగ్రీలను పొందారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె న్యాయశాస్త్రం బోధించేది. 2019లో కెనడాలోని ఓక్‌విల్లే స్థానం నుంచి మొదటి సారి ఎన్నికల్లో గెలిచారు. 2021లో రక్షణ మంత్రిగా నియమితులయ్యారు.

Next Story