Anish Dayal: డిప్యూటీ ఎన్ఎస్ఏగా అనిష్ దయాల్ సింగ్

by B.Srinivas |

రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అనిష్ దయాల్ సింగ్‌ను డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ)గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.

Anish Dayal: డిప్యూటీ ఎన్ఎస్ఏగా అనిష్ దయాల్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అనిష్ దయాల్ సింగ్‌ (Anish dayal singh) ను కేంద్ర ప్రభుత్వం డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ)గా నియమించింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయనకు అంతర్గత వ్యవహారాలను అప్పగించినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అనిష్ దయాల్ 1988 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. 2024 డిసెంబర్‌లో ఆయన పదవీ విరమణ చేశారు. తన కెరీర్‌లో కీలక బాధ్యతలను నిర్వర్తించారు. సీఆర్‌పీఎఫ్ (CRPF), ఐటీబీపీ (ITBP), ఎస్ఎస్‌బీ (SSB) లకు డైరెక్టర్ జనరల్‌గా పని చేశారు. సీఆర్‌పీఎఫ్ డీజీగా ఉన్న టైంలో ఆయన జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించడానికి కీలకంగా కృషి చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆయనకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) డైరెక్టర్ జనరల్ పదవిని అదనంగా అప్పగించింది. డిప్యూటీ ఎన్ఎస్ఏగా బాధ్యతలు చేపట్టాక అనిష్ జాతీయ భద్రతా వ్యూహాలను రూపొందించడంలో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్‌కు సహాయం చేయనున్నారు.

Next Story