- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anil Ambani: రూ.40 వేల కోట్ల బ్యాంక్ మోసం.. అనిల్ అంబానీకి మరోసారి ED నోటీసులు
రూ.40 వేల కోట్ల మనీ లాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ వరుసగా రెండో రోజు నోటీసులు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రూ.40 వేల కోట్ల భారీ మనీ లాండరింగ, బ్యాంక్ లోన్ మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా అనిల్ అంబానీకి వరుసగా రెండో రోజు ఇవాళ కూడా చారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. కాగా, నిన్న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అధికారులు అనిల్ అంబానీని సుమారు 9 గంటల పాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCOM) నిధుల మళ్లింపుపై ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. విచారణకు ఒకరోజు ముందే, ముంబైలోని పాలి హిల్స్‌లో ఉన్న రూ.3,716 కోట్ల విలువైన అంబానీ విలాసవంతమైన నివాసం ‘అబోద్’ను ఈడీ జప్తు చేసింది. అయితే, ఆర్ కామ్ ద్వారా వివిధ బ్యాంకుల నుంచి పొందిన సుమారు రూ.40 వేల కోట్ల రుణాలను షెల్ కంపెనీలు, విదేశీ అనుబంధ సంస్థలకు మళ్లించారనేది అనిల్ అంబానీపై ప్రధాన ఆరోపణగా ఉంది.
ఇదే సమయంలో బ్యాంక్ ఆఫ్ బరోడాను రూ. 2,220 కోట్లకు పైగా మోసం చేశారనే ఆరోపణపై సీబీఐ (CBI) కూడా అనిల్ అంబానీపై తాజా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆయన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది.






