భారతదేశ ఇంధన భద్రతలో అంగోలా కీలక పాత్ర పోషిస్తుంది: రాష్ట్రపతి ముర్ము

by Malleboina Mahesh |   (  Updated:2025-11-09 13:01:19  IST  )

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగోలాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతదేశ ఇంధన భద్రతలో అంగోలా కీలక భాగస్వామి గా నిలుస్తుందని భారత ప్రతినిధి బృందం వెల్లడించింది.

భారతదేశ ఇంధన భద్రతలో అంగోలా కీలక పాత్ర పోషిస్తుంది: రాష్ట్రపతి ముర్ము
X

దిశ, వెబ్ డెస్క్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) అంగోలాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతదేశ ఇంధన భద్రతలో అంగోలా కీలక భాగస్వామి గా నిలుస్తుందని భారత ప్రతినిధి బృందం వెల్లడించింది. అంగోలా చమురు, గ్యాస్ ఉత్పత్తుల ప్రధాన కొనుగోలుదారుల్లో భారత్ ఒకటని, ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని భారత్ సంకల్పించింది. భారత చమురు, గ్యాస్ సంస్థలు అంగోలాతో దీర్ఘకాలిక కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయని, అదనంగా అక్కడి ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ అప్‌స్ట్రీమ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని ఆమె తెలిపింది.

భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ పెట్రోలియం శుద్ధి దేశాలలో ఒకటని గుర్తు చేసిన ప్రతినిధులు, అంగోలాలో ఉన్న వివిధ శుద్ధి కర్మాగార ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు భారత కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నారు. అలాగే, భారత కంపెనీలకు అంగోలాలో అరుదైన భూమి ఖనిజాలను అన్వేషించే సామర్థ్యం ఉందని, ఈ సహకారం భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ టెక్నాలజీ, కృత్రిమ మేధ (AI) వంటి ఆధునిక రంగాల్లో భారత్–అంగోలా భాగస్వామ్యాలకు కొత్త దారులు తెరుస్తుందని ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము తెలిపారు.

Next Story