- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Angad Chadok: ఆర్థిక నేరాలకు పాల్పడిన అంగద్ చండోక్ సింగ్ అరెస్టు
భారత్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడిన అంగద్ చండోక్ సింగ్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. భారత్ లోనే కాకుండా. అమెరికాలోనూ (US) అక్రమాలకు పాల్పడుతున్న అంగద్ చండోక్ సింగ్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడిన అంగద్ చండోక్ సింగ్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. భారత్ లోనే కాకుండా. అమెరికాలోనూ (US) అక్రమాలకు పాల్పడుతున్న అంగద్ చండోక్ సింగ్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై బ్యాంకు మోసం, మనీలాండరింగ్ కేసులు ఉన్నాయి. దీంతో, అమెరికా అధికారుల సాయంతో అతడ్ని భారత్ కు రప్పించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. చండోక్ సింగ్ అమెరికాలోనూ పలు మోసాలకు పాల్పడ్డాడు. అంతర్జాతీయ టెక్ సపోర్ట్ పేరుతో మరికొందరితో కలిసి అమెరికాలోని పలువురు వృద్ధులను మోసం చేసిన కేసులో 2022లో అమెరికా కోర్టు అతడిని దోషిగా తేల్చి ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. మరోవైపు కాలిఫోర్నియాలోనూ అతడు మనీలాండరింగ్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీనిలో అతడు షెల్ కంపెనీలను సృష్టించి అమెరికన్ల నుంచి మిలియన్ల డాలర్లను ఆన్‌లైన్ టెక్ సపోర్ట్ స్కీమ్ ద్వారా దోచుకున్నాడని తెలిపారు. ఈ అక్రమాలల్లో అంగద్ కు సాయం చేసిన మరో ఐదుగురిపైనా కేసులు నమోదైనట్లు అధికారుల తెలిపారు. గతంలో అతడు భారత్‌లో కూడా పలువురిని మోసం చేసినట్లు కేసులు ఉండడంతో అమెరికా అధికారుల సాయంతో అతడ్ని సీబీఐ భారత్ రప్పించారు.






