రూల్స్ బ్రేక్ చేసిన వాహ‌న‌దారుడు..ఇచ్చిప‌డేసిన‌ వృద్ధురాలు

by velandi.Saikiran |

Kozhikode: రూల్స్ బ్రేక్ చేసిన బైకర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఓ వృద్ధురాలు. దీంతో రూల్స్ పాటిస్తూ, వెళ్లిపోయాడు బైక‌ర్‌.

రూల్స్ బ్రేక్ చేసిన వాహ‌న‌దారుడు..ఇచ్చిప‌డేసిన‌ వృద్ధురాలు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ట్రాఫిక్ రూల్స్ చాలా మంది పాటించరు. తమకు నచ్చిన విధంగా రోడ్లపై వెళ్తుంటారు. కొంతమంది ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి మరి వెళ్ళిపోతూ ఉంటారు. సిగ్నల్స్ పడ్డా కూడా ఆగరు. దానివల్ల ట్రాఫిక్ సమస్యతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయి ఛాన్సులు ఉంటాయి. నేను ఒక్కడినే రూల్స్ బ్రేక్ చేస్తే... అంత జరుగుతుందా ? అనుకొని ప్రతి ఒక్కరు అలాగే చేస్తున్నారు. అయితే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన ఓ వ్యక్తికి 80 ఏళ్ల వృద్ధురాలు తగిన బుద్ధి చెప్పింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

రూల్స్ బ్రేక్ చేసిన బైకర్.. ఇచ్చిపడేసిన వృద్ధురాలు

సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా వృద్ధురాలు (Old Women) చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేరళలోని కోజికోడ్ ఫుట్ పాత్ దగ్గర నిత్యం ట్రాఫిక్ ఉంటుంది. వాహనాలు ముందుకు కదలాలంటే చాలా సేపు ఆగాల్సిందే. అయితే , హెవీ ట్రాఫిక్ ఉన్న నేపథ్యంలో ఓ టూ వీలర్ వాహనదారుడు రూల్స్ బ్రేక్ చేశాడు. జనాలు నడిచే ఫుట్ పాత్ పై నుంచి తన బైక్ ను తీశాడు. అయితే అక్కడే ఉన్న 80 సంవత్సరాల వృద్ధురాలు.. ఆ వాహనదారున్ని ఆపేసింది. అడ్డుగా నిలిచింది. ట్రాఫిక్ రూల్స్ ఎందుకు బ్రేక్ చేశావని నిలదీసింది. దీంతో ఆ వృద్ధురాలను బెదిరించే ప్రయత్నం చేశాడు వాహనదారుడు. కానీ ఆ వృద్ధురాలు బెద‌ర‌లేదు. వెంటనే మొబైల్ తీసి, ఫోటోలు, వీడియోలు తీసే ప్రయత్నం చేసింది. దీంతో బెదిరిపోయిన ఆ వాహనదారుడు, వెనక్కి వెళ్ళిపోయాడు. అందరిలాగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ముందుకు వెళ్లాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ ఫిదా అయిపోతున్నారు. ఆమె ధైర్యానికి అందరూ మెచ్చుకోవాల్సిందే అంటున్నారు.

Next Story