- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DU విద్యార్థి ఇంట్లో బస చేసిన అమృత్‌పాల్ సింగ్
ఖలిస్తాని నాయకుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు దేశం మొత్తం గాలిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఖలిస్తాని నాయకుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు దేశం మొత్తం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే అతను నేపాల్ పారిపోయినట్లు వదంతులు రావడంతో దేశవ్యాప్తంగా మిషన్ అమృత్‌పాల్‌సింగ్ ను ఎర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. తలపాగ తీసేసిన అతను మాస్క్ ధరించి ఢిల్లీలో తిరగడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
అలాగే ఢిల్లీ యూనివర్సిటీలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి గృహంలో ఖలీస్తాన్ నాయకుడు అమృత్ పాల్ సింగ్ అలాగే అతని సహచరుడు పాపల్‌ప్రీత్ తూర్పు ఢిల్లీలోని లక్ష్మీ నగర్ లో విద్యార్థినికి చెందిన అద్దె గృహంలో ఆశ్రయం తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అలాగే అతను నేపాల్ పారిపోయో ముందు ఇక్కడే ఆశ్రయం పొందినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కాగా అమృత్‌పాల్ మార్చి 18 నుంచి పరారీలో ఉన్నాడు.






