అన్నాడీఎంకే ఛాన్స్ ఇవ్వండి...గ‌వ‌ర్న‌ర్ కు సంచ‌ల‌న లేఖ !

by velandi.Saikiran |   (  Updated:2026-05-08 18:20:52  IST  )

ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అన్నాడీఎంకేకు ఛాన్స్ ఇవ్వండి అంటూ గ‌వ‌ర్న‌ర్ కు దిన‌క‌ర‌ణ్ సంచ‌ల‌న లేఖ రాశారు.

అన్నాడీఎంకే ఛాన్స్ ఇవ్వండి...గ‌వ‌ర్న‌ర్ కు సంచ‌ల‌న లేఖ !
X

దిశ‌, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా TVK నిలిచినప్పటికీ విజయ్ కి నిద్ర లేకుండా పోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆయన చాలా కష్టపడుతున్నారు. ముందుగా మద్దతు ప్రకటించిన IUML తాజాగా వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మద్దతిస్తామని ప్రకటించిన VCK నుంచి గవర్నర్ కు అధికారికంగా లేఖ‌ కూడా అందలేదని స‌మాచారం.

దీంతో విజయ్ పార్టీకి సంఖ్యా బలం 116కు పరిమితమైంది. మ్యాజిక్ ఫిగర్ 118 అందుకోవాలంటే మరో రెండు సీట్లు అవసరం. దీంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై మళ్లీ సందిగ్ధత నెలకొంది. ఇదంతా పక్కకు పెడితే, తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. శశికళ సోదరి కుమారుడు, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం ( AMMK ) పార్టీ చీఫ్ టీటీవీ దినకరణ్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అన్నాడీఎంకే అధినేత పళ‌ని స్వామి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని గవర్నర్ రాజేంద్రకు ఆయన తాజాగా లేఖ రాశారు. బలం నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. కాగా మొన్నటి ఎన్నికల్లో AMMK పార్టీ ఒక సీటు కూడా గెలిచింది.

Next Story