- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video: కారులో ఇదేం పని..? లా స్టూడెంట్స్ ఇలాంటివి చేస్తే ఎలా? 60 సార్లు కొట్టారు!
జాన్వి మిశ్రా అనే యువతి అబ్బాయిల కంటే దూకుడుగా, హింసాత్మకంగా కనిపిస్తుందని నెట్టింట వీడియో వైరల్ అవుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Viral video) లక్నోలోని (Amity University) అమిటీ విశ్వవిద్యాలయంలో శిఖర్ ముఖేశ్ కేసర్వానీ అనే విద్యార్థి రెండో సంవత్సరం లా చదువుతున్నాడు. అయితే శిఖర్‌ను అతని సహవిద్యార్థులు వర్సిటీ పార్కింగ్ స్థలంలో కారులోకి ఎక్కించుకొని దాదాపు 60 సార్లు చెంపదెబ్బలు కొట్టారు. వారి మధ్య గొడవకు గల కారణాలేంటో తెలియదు గానీ.. అతనిపై తీవ్రంగా దాడి చేశారు. ఆగస్టు 26న జరిగిన ఘటన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ప్రకారం.. అమిటీ విశ్వవిద్యాలయంలో (Law Students) న్యాయశాస్త్రం చదువుతున్న ఆర్యమాన్ శుక్లా, మిలే బెనర్జీ, వివేక్ సింగ్, జాన్వి మిశ్రా అనే విద్యార్థులు తమ సొంత విశ్వవిద్యాలయం నుంచి తోటి విద్యార్థిని కిడ్నాప్ చేశారు. వారు అతన్ని కారులో నుంచి బయటకు పారిపోకుండా కనికరం లేకుండా తీవ్రంగా కొట్టారు.
అందులో (Janhvi Mishra) జాన్వీ మిశ్రా అనే యువతి అబ్బాయిల కంటే దూకుడుగా, హింసాత్మకంగా కనిపిస్తుందని నెట్టింట వీడియో వైరల్ అవుతోంది. జాన్వి మిశ్రా బుతులతో రెచ్చిపోయి పదే పదే వ్యక్తిని ఎలా కొడుతుందో వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. బాధిత విద్యార్థి ఏదైనా తప్పు చేసి ఉంటే, వారు చట్టపరమైన చర్య తీసుకోవాలి. న్యాయశాస్త్రం చదువుతున్న విద్యార్థులు నేరస్థులుగా మారితే, దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది.. అని నెటిజన్‌లు కామెంట్స్ చేస్తున్నారు. వ్యక్తి తప్పు చేసి ఉంటే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి.. అంతే కానీ కారులో కొట్టి చంపే విధంగా ఇదేం పని అంటూ నెటిజన్‌లు లా స్టూడెంట్స్‌పై మండిపడ్డారు. ఇక, తన కొడుకును దారుణంగా కొట్టారని, అంతేకాకుండా క్యాంపస్ నుంచి వెళ్లిపోవాలని బెదిరించడమే కాకుండా, తల్లిదండ్రులను కూడా చంపేస్తామని బెదిరించారని ఈ ఘటనపై బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తమ బిడ్డ క్యాంపస్‌లో చదవడం లేదని తండ్రి పేర్కొన్నాడు. వీడియో కోసం క్లిక్ చేయండి..






