ఎవ్వరినీ వదలం.. వెంటాడతాం : Amit Shah

by Muthe.Rajitha |   (  Updated:2025-11-11 13:48:14  IST  )

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ ఆత్మహుతి పేలుడు జరిగిన సంగతి తెలిసిందే.

ఎవ్వరినీ వదలం.. వెంటాడతాం : Amit Shah
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ ఆత్మహుతి పేలుడు సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ దాడి వెనుక ఉన్న ప్రతి ఒక్క నిందితుడిని వేటాడతామని, ప్రమేయం ఉన్న అందరిపై ఉక్కుపాదం మోపుతామని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ పేలుడు ఘటనలో 13 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. దేశ రాజధాని డిల్లీతో పాటు దేశవ్యాప్తంగా అన్ని నగరాలలో హై అలర్ట్ ప్రకటించి, భద్రత కట్టుదిట్టం చేసారు. ఇప్పటికే ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)కు అప్పగించగా.. ఈ దాడి వెనుక జైషే-ఇ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

Next Story