- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amith shah: జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తాం.. కేంద్ర మంత్రి అమిత్ షా
ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని కేంద్రం హోం మంత్రి అమిత్ షా (Amith shah) స్పష్టం చేశారు. తన వాగ్ధానానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర పాలిత ప్రాంతమైన కశ్మీర్‌కు ఎప్పటికైనా రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని కానీ అది ఎప్పుడనేది బహిరంగంగా ప్రకటించలేమని తెలిపారు. మోడీ ప్రభుత్వ హయాంలో మొదటి సారిగా కశ్మీర్‌లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని కొనియాడారు. టియర్ గ్యాస్ షెల్, ఒక్క తుపాకీ గుండు పేలకుండా, 60 శాతం మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. రీపోలింగ్ కూడా ఎక్కడా జరగలేదని, 40 ఏళ్లలో ఇదే తొలిసారని తెలిపారు.
ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలనే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై అమిత్ షా సమాధానమిస్తూ.. ఓటు బ్యాంకు కోసం, కాంగ్రెస్ మతం ఆధారంగా కాంట్రాక్టులు ఇవ్వాలని కోరుకుంటోందని విమర్శించారు. క్వాలిటీ ఆధారంగా కాంట్రాక్టులు కేటాయించాలని సూచించారు. కాగా, 2019లో ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. కశ్మీర్‌లో వివిధ పార్టీల నుంచి పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణకు డిమాండ్లు తెరమీదకు వస్తున్న నేపథ్యంలో అమిత్ షా ప్రకటన కీలకంగా మారింది.






