- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amith shah: నక్సలైట్లు లొంగిపోయే వరకు ఊరుకోబోము.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా
మావోయిస్టులను అంతమొందించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: మావోయిస్టులను అంతమొందించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) స్పష్టం చేశారు. దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చడమే మోడీ ప్రభుత్వ లక్ష్యమని తేల్చి చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్ట కొండలపై ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’ను విజయవంతంగా నిర్వహించిన సీఆర్‌పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, కోబ్రా జవాన్లు బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రసంగించారు. నక్సలైట్లందరూ లొంగిపోయే వరకు లేదా నిర్మూలించే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. దేశంలోని తక్కువ అభివృద్ధి చెందిన కొన్ని ప్రాంతాలకు నక్సల్స్ తీవ్ర నష్టం కలిగించారని, పాఠశాలలు, ఆస్పత్రులకు అంతరాయం కలిగించారని, అంతేగాక ప్రభుత్వ సంక్షేమ పథకాలనూ అడ్డుకుంటున్నారని విమర్శించారు.
నక్సల్స్ ఏరివేత వల్ల ప్రజల జీవితాల్లో మార్పులు వస్తున్నాయన్నారు. 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నొక్కి చెప్పారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ టైంలో జవాన్లు ప్రదర్శించిన ధైర్యం, పరాక్రమం నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల చరిత్రలో నూతన అధ్యాయంగా గుర్తుండిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.






