Amith shah: భారత్‌ను బెదిరిస్తే తీవ్ర పరిణామాలు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా

by B.Srinivas |

భారత ప్రజలను, దేశ సైన్యాన్ని ఎవరైనా బెదిరింపులకు గురిచేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఆ

Amith shah: భారత్‌ను బెదిరిస్తే తీవ్ర పరిణామాలు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రజలను, దేశ సైన్యాన్ని ఎవరైనా బెదిరింపులకు గురిచేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్‌ (Operation sindhoor) తో ప్రపంచానికి భారత్ స్పష్టమైన సందేశం పంపిందని నొక్కి చెప్పారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో సోమవారం జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘ఉగ్రవాదులు ఉరిలో భారత్‌పై దాడి చేశారు, మేము సర్జికల్ స్ట్రైక్‌తో ప్రతీకారం తీర్చుకున్నాం. వారు పుల్వామాలో అటాక్ చేయగా వైమానిక దాడి చేశాం. ఆపై ఉగ్రవాదులు పహెల్గాంను లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఆపరేషన్ సిందూర్‌తో ధీటుగా సమాధానమిచ్చాం. మోడీ ప్రభుత్వ హయాంలో దేశ రక్షణ విధానంలో మార్పు వచ్చింది’ అని వ్యాఖ్యానించారు. పహెల్గాం నిందితులు ఎక్కడున్నా వారిని మట్టుబెడతాం అని తెలిపారు.

గత ప్రభుత్వాల హయాంలో ఉగ్రవాద దాడులకు తరచుగా సమాధానం లభించలేదని, బలహీనమైన ప్రతిస్పందనలు ఎదురయ్యాయని ఆరోపించారు. కానీ భారత్ ప్రస్తుతం తన వ్యూహాన్ని మార్చుకుందని, ప్రతి చర్యకూ బలంగా ప్రతిస్పందిస్తుందని చెప్పారు. దేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూలించడానికి కట్టుబడి ఉన్నామని, 2026 మార్చి 31 నాటికి దానిని అంతం చేస్తామని దీమా వ్యక్తం చేశారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రేను గుర్తు చేసుకున్న అమిత్ షా ఆయన బతికుంటే ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసించే వారని తెలిపారు.

Next Story