Amith shah: త్వరలోనే కశ్మీర్‌లో శాశ్వత శాంతి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా

by B.Srinivas |

కశ్మీర్‌లో త్వరలోనే శాశ్వత శాంతి నెలకొంటుందని, ఉగ్రవాదం పూర్తిగా అంతమయ్యేందుకు ఎంతో దూరం లేదని అమిత్ షా నొక్కి చెప్పారు.

Amith shah: త్వరలోనే కశ్మీర్‌లో శాశ్వత శాంతి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌ (Jammu kashmir)లో త్వరలోనే శాశ్వత శాంతి నెలకొంటుందని, ఉగ్రవాదం పూర్తిగా అంతమయ్యేందుకు ఎంతో దూరం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) నొక్కి చెప్పారు. సోమవారం నిర్వహించిన వతన్ కో జానో అనే ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్‌లో అమిత్ షా ప్రసంగించారు. జమ్మూ కశ్మీర్ ప్రజలకు ఇతర రాష్ట్రాల పౌరుల మాదిరిగానే మొత్తం దేశంపై సమాన హక్కులు ఉన్నాయని చెప్పారు. ఇక్కడి యువత మొత్తం దేశాన్ని అన్వేషించాలని కోరారు. భారత్ కశ్మీరీలను ప్రేమ, గౌరవంతో చూస్తుందన్నారు. కశ్మీర్‌లో శాశ్వత శాంత ఉండాలని, టెర్రరిజాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

హింస వల్ల ప్రాణనష్టం తప్ప ఇంకేమీ ఉండబోదని, కశ్మీర్‌లో దశాబ్దాల ఉగ్రవాదం కారణంగా 36,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 (Article 370) రద్దు నిర్ణయం అన్ని పౌరులకు సమానత్వాన్ని నిర్ధారించిందని చెప్పారు. ఇప్పుడు జమ్మూ కశ్మీర్ ప్రజలు ఢిల్లీ (Delhi), రాజస్థాన్ (Rajasthan), గుజరాత్ (Gujarath) ప్రజల మాదిరిగానే భారతదేశంలో ఎక్కడైనా సమాన హక్కులను కలిగి ఉన్నారన్నారు. గత పదేళ్లలో జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం గణనీయంగా తగ్గిందని, బాంబు పేలుళ్లు, రాళ్ల దాడి సంఘటనలు ముగిశాయన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని చెప్పారు.

Next Story