- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amith shah: భారత్‌ను చూస్తే పాక్ వణికిపోతున్నది.. కేంద్ర మంత్రి అమిత్ షా
ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఉగ్ర దాడులకు మోడీ దీటుగా స్పందించారని కొనియాడారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) ప్రశంసలు కురిపించారు. ఉగ్రవాద దాడులకు ప్రధాని మోడీ (Modi) దీటుగా స్పందించారని, మోడీ చర్యలతో ప్రపంచం ఆశ్చర్యపోయిందని కొనియాడారు. భారత్ దెబ్బకు పాక్ భయబ్రాంతులకు గరవుతోందన్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. భారత సాయుధ దళాలు పాక్ లోపల 100 కిటోమీటర్ల వరకు వెళ్లి దాడి చేసి ఉగ్రవాదులకు తగిన సమాధానం ఇచ్చాయన్నారు. అనేక అంతర్జాతీయ ఉగ్ర కార్యకలాపాలకు ప్రణాళికలు వేసి సియాల్‌కోట్, ఇతర ఉగ్రవాద శిబిరాల్లో దాక్కున్న వారికి భారత్ నుంచి స్పష్టమైన సందేశం అందిందన్నారు. ఇండియాకు వ్యతిరేకంగా ఏదైనా కుట్ర జరిగితే ప్రతిస్పందన రెండింతలు బలంగా ఉంటుందని హెచ్చరించారు.
‘ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్‌లోని జైష్-ఏ-మొహమ్మద్, లష్కరే-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే, వారు దాక్కునే రహస్య స్థావరాలుగా ఉన్న 9 ప్రదేశాలను నేలమట్టం చేశాం’ అని తెలిపారు. ‘తమ వద్ద అణు బాంబులు ఉన్నాయని బెదిరించే వారు, మేము భయపడతామని భావించారు. కానీ దేశ సైన్యం, నేవీ, వైమానిక దళం వారికి తగిన సమాధానం ఇచ్చాయి. ప్రపంచం మొత్తం సైన్యం సహనాన్ని, దృఢ నిశ్చయంతో కూడిన మోడీ నాయకత్వాన్ని ప్రశంసిస్తోంది’ అని చెప్పారు. భారత దళాలు పాక్ లోపల 100 కిలోమీటర్లు చొచ్చుకుపోయి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం స్వాతంత్ర్యం తర్వాత ఇదే మొదటిసారి అని తెలిపారు.






