Amith shah: 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి.. కేంద్ర మంత్రి అమిత్ షా

by vinod kumar |
Amith shah: 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి.. కేంద్ర మంత్రి అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: గత దశాబ్ద కాలంలో ప్రధాని మోడీ (Pm modi) కృషి వల్ల 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) అన్నారు. 60 కోట్ల అట్టడుగు జనాభాలో పేదరికాన్ని పరిష్కరించడంలో భారత్ పురోగతి సాధించిందని కొనియాడారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పేదరికంలో ఉంటే దేశ అభివృద్ధి సాధ్యం కాదని గ్రహించిన మోడీ దానిని నిర్మూలించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. హౌసింగ్, తాగునీరు, గ్యాస్ సిలిండర్లు, ఆరోగ్య సంరక్షణ, ఉచిత రేషన్ పథకాలు వంటి పథకాలు గత ప్రభుత్వ హయాంలో సరిగా అమలు కాలేదన్నారు. మోడీ వచ్చాక ఈ తరహా పథకాలన్నింటినీ సక్రమంగా అమలు చేశామన్నారు. 2014 నుంచి 60 కోట్ల మంది పౌరులకు ప్రాథమిక సౌకర్యాలను అందజేస్తూ, రాజ్యాంగ నిర్మాతలు ఊహించిన సంక్షేమ రాజ్యాన్ని మోడీ రియాలిటీగా మార్చారని ప్రశంసించారు. ఐక్యరాజ్యసమితి లెక్కల్లోనూ ఇదే విషయాన్ని వెల్లడించిందని గుర్తు చేశారు. అయితే కేవలం ప్రభుత్వం ద్వారా మాత్రమే ఇది సాధ్యం కాలేదని, అనేక ట్రస్టులు దీనిలో పాలుపంచుకున్నాయని తెలిపారు. ట్రస్టులు, వ్యక్తులు, సేవా సంస్థలు ఏకమైతే దేశం త్వరలోనే పేదరికాన్ని జయిస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed