- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amith shah: వర్షాకాలంలోనూ నక్సలైట్లను నిద్రపోనివ్వను.. కేంద్ర మంత్రి అమిత్ షా వార్నింగ్
వర్షాకాలంలోనూ మావోయిస్టులను నిద్ర పోనివ్వబోనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. మావోయిజాన్ని అంతం చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: వర్షాకాలంలోనూ మావోయిస్టులను నిద్ర పోనివ్వబోనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) వార్నింగ్ ఇచ్చారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిజాన్ని అంతం చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్‌లో ఆదివారం నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (NFSU) క్యాంపస్, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL) లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ప్రసంగించారు. వర్షాకాలంలో మావోయిస్టులను ప్రశాంతంగా కూర్చోనివ్వబోమని, వర్షంలోనూ ఆపరేషన్ కగార్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి అభివృద్ధి ప్రయాణంలో చేరాలని సూచించారు. మావోయిస్టులతో చర్చలు జరపాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. ఇప్పటికే అనేక మంది శాంతి మార్గాలన్ని ఎంచుకున్నారని గుర్తు చేశారు.
ఫోరెన్సిక్ సైన్స్‌లో పెరుగుతున్న అవకాశాలను స్వీకరించాలని ఛత్తీస్‌గఢ్ యువతను కోరారు. ఎన్ఎఫ్ఎస్‌యూ శాశ్వత క్యాంపస్ మూడేళ్లలో పూర్తిగా అభివృద్ధి చేయబడుతుందని, ఇది ఛత్తీస్‌గఢ్ యువతకు ఫోరెన్సిక్ రంగంలో అపారమైన కెరీర్ అవకాశాలను సృష్టింస్తుందన్నారు. దేశవ్యాప్తంగా అమలు చేయబడిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలతో దేశంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్ గురించి ప్రధాని మోడీ దార్శనికత ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, ఆర్థిక పురోగతిపై మాత్రమే గాక సకాలంలో న్యాయం అందించడంపైనా దృష్టి పెట్టిందని తెలిపారు.






